ప్రియాంక గాంధీపై పాక్ మంత్రి ప్రశంసలు..
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రశంసలు కురిపించారు. దీనికి కారణం పార్లమెంట్‌కు ఆమె పాలస్తీనా బ్యాగ్ తీసుకెళ్లడమే. ఈ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. “ఫ్రీడమ్ ఫైటర్ జవహర్ లాల్ నెహ్రూ మునిమనమరాలి నుండి ఇంకేం ఆశిస్తాం.. మరుగుజ్జుల మధ్య ఆమె మహోన్నతంగా నిలిచారు. పాక్ పార్లమెంట్‌లో కూడా ఎవరూ ఇంతవరకూ అంత ధైర్యం చేయలేదు” అంటూ మెచ్చుకున్నారు. అయితే బంగ్లాదేశ్ విషయంలో ప్రియాంకపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాలో హిందువులపై జాలి చూపని ప్రియాంక, ముస్లిములను మాత్రం బుజ్జగిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.