విశాఖలో పాకిస్తానీ కుటుంబం..
ఏపీలోని విశాఖలో నివసిస్తున్న పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్, భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం ఉంది. కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని, ఇప్పుడు భారత్ విడిచి వెళ్లలేమని ఆ కుటుంబం విశాఖ సీపీని వేడుకుంది. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా విశాఖకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

