ఏపీలో పాకిస్తాన్ మద్దతుదారుల హల్‌చల్
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మరక్షా దళ్ యువకుల నిరసనలు చేపట్టారు. పాక్ జెండాలు రోడ్డుపై పరిచి ధర్మ రక్షాదళ్ ఆందోళన చేస్తుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుండి వచ్చారో పాకిస్తాన్ మద్దతుదారులు వచ్చి పాక్ జెండాలు తొలగించారు. ఈ వీడియోలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు యువకులు ఈ పని చేశారని, వారిని పాక్ మద్దతుదారులుగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

