ఈ క్షిపణి ప్రయోగంతో పాక్ నవ్వులపాలు
పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత యుద్ధ భయంతో విపరీత చర్యలకు పాల్పడుతోంది. కవ్వింపు చర్యలలో భాగంగా పాక్ సైన్యం క్షిపణి పరీక్ష చేసింది. బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. ఇది కేవలం 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ మిస్సైల్ చేధిస్తుంది. ఇలాంటి ప్రయోగాలతో ప్రపంచదేశాలలో నవ్వులపాలవుతోంది పాక్. ఖండాంతర క్షిపణులు తమ దగ్గర ఉన్నాయని భారత్‌కు సందేశం పంపే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. భూతలం నుంచి భూతలం మీద ఉన్న టార్గెట్లను ఈ మిస్సైల్ చేధిస్తుంది. గతంలో ఈ క్షిపణిని పలుమార్లు పాకిస్తాన్ ఆధునీకరించింది. 2000 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఈ మిస్సైల్ చేధిస్తుందని గొప్పలు చెప్పుకుంటోంది పాకిస్తాన్. కానీ వాస్తవం ఏమిటంటే వీటి గరిష్ట పరిధి కేవలం 450 కిలోమీటర్లు మాత్రమే. మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశం అంతరిక్ష, రక్షణ రంగంలో కొత్త ఎత్తులను అధిరోహిస్తుండగా, పాకిస్తాన్ ఇప్పటికీ తన పాత స్వల్ప-శ్రేణి క్షిపణుల గురించి గొప్పలు చెప్పుకుంటోంది. భారత్ వద్ద పృధ్వీ, అగ్ని సిరీస్, బ్రహ్మోస్ వంటి క్షిపణులు 5 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలను చేధించగలవు.

