InternationalNews

ప్రపంచంలోనే డేంజరస్ కంట్రీ పాకిస్తాన్ : బైడెన్‌

అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్ ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన దేశమన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా గురించి మాట్లాడుతున్న సమయంలో అమెరికా విదేశాంగ విధానం గురించి బిడెన్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నానని… అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంలో వాటిని ఎలా నిర్వహించాలన్నది కూడా తెలియదన్నారు. చైనా అధ్యక్షుడు జీజన్పింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద మేధావి అన్న బైడెన్… ఆయన ఏం కావాలో తెలుసునన్నారు. చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయందన్నారు. ఈ తరుణంలో మొత్తం వ్యవహారాన్ని డీల్ చేస్తాడో చూడాలన్నారు. రష్యాలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. పుతిన్ చేస్తున్న అరచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ ఒకటన్నారు. ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉందని… డెమోక్రటిక్ పార్టీ కార్యక్రమంలో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిడెన్ వ్యాఖ్యలు అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఎదురుదెబ్బగా భావించవచ్చు. 21వ శతాబ్దం రెండవ త్రైమాసికంలో డైనమిక్‌ను మార్చడానికి అమెరికాకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహం విడుదలైన రెండు రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్. 48 పేజీల రిపోర్టులో పాకిస్థాన్‌ ప్రస్తావన చేయకపోవడం విశేషం. చైనా, రష్యా రెండింటి నుండి యుఎస్‌కు ఎదురయ్యే ముప్పును ఈ రిపోర్టులో అమెరికా స్పష్ట చేసింది. చైనా మరియు రష్యాలు ఒకదానికొకటి ఎక్కువగా కలిసిపోతున్నాయని, అయితే అవి విసిరే సవాళ్లు ప్రమాదకరంగా మారుతున్నాయని.. అమెరికాకు తలనొప్పి అవుతోందన్నారు. వచ్చే పదేళ్లు చైనాతో పోటీ నిర్ణయాత్మక దశకు చేరుకుంటుందంటుందన్నారు.