పాక్ ఉగ్రదేశమే.. ఒప్పుకున్న పాక్ నేత
తమ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట నిజమేనని, ఉగ్రవాద చరిత్ర తమ దేశానికి ఉందని అంగీకరించారు పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో. ఇటీవల పాక్ రక్షణ మంత్రి కూడా తమ దేశం అమెరికా వంటి దేశాల ప్రభావంతో ఉగ్రవాదులను ఉపేక్షించిందని, అది తప్పేనని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌కు ఉన్న చరిత్రను కాదనలేమని, అదేమీ రహస్యం కాదని పేర్కొన్నారు భుట్టో. ఈ ఉగ్రవాదం వల్ల తామెంతో నష్టపోయామని, ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకుని సమస్యల పరిష్కారానికి సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని పేర్కొన్నాడు.