‘హనీట్రాప్’లో పాక్ హైకమిషనర్..వీడియో లీక్..
పాకిస్తాన్ తరపున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ అనే అధికారి హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. మరూఫ్ ఒక బంగ్లాదేశ్ అమ్మాయితో తిరుగుతున్న ఫోటోలు, అశ్లీల వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడంతో పాకిస్తాన్ అప్రమత్తమయ్యింది. దీనితో పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలువుపై పంపించివేసింది. మే 11న ఢాకా నుండి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది. కానీ పాక్ అధికారులు మాత్రం అతడు అధికారికంగా సెలవులో ఉన్నాడంటూ చెప్తున్నారు. పాక్ విదేశాంగ శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నిఘా సమాచారాన్ని పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరూఫ్ స్థానంలో డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.