ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇకపై వార్తల్లో కనిపించరు..వినిపించరు. ఎందుకంటే ఆయనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించి గానీ,ఆయన పార్టీకి సంబంధించి గానీ ఎటువంటి వార్తలను ప్రసారం చేయొద్దని పాకిస్థాన్ ప్రభుత్వం మీడియా వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిని మీడియా ప్రోత్సహించకూడదని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అల్లరి మూకలను నిర్మూలించండి అంటూ స్థానిక మీడియా రెగ్యూలేటరీ అథారిటీ స్పష్టం చేసింది. కాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి ఆరోపణల కేసులో పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పాకిస్థాన్‌లో అల్లర్లతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.