పాక్-బంగ్లాదేశ్ మ్యాచ్ టిక్కెట్ ఇంత చవకా…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ టీమ్‌ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో టిక్కెట్ రేటు ఫిక్సయ్యింది. అంటే గరిష్ఠ ధర కాదండోయ్, రికార్డు స్థాయిలో కనిష్ఠ ధర. ఇంత చవకగా గత పదేళ్లలో ఎన్నడూ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్‌ను విక్రయించలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. స్టేడియంలో మ్యాచ్‌లు చూసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఇటీవల నిర్వహించిన PSLకు కూడా ప్రేక్షకులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. దీనితో పాక్, బంగ్లా టెస్ట్ సిరీస్ టిక్కెట్ల ధరను కేవలం రూ.15 లకే విక్రయించడానికి నిర్ణయించారు. ఇది ఆగస్టు 30 నుండి కరాచీలో జరగబోతోంది. ఈ ధరకైనా ఫ్యాన్స్ టిక్కెట్ కొని, చూస్తారో లేదో…


 
							 
							