డ్యాన్స్ వీడియోలో పట్టుబడ్డ పహల్గామ్ ఉగ్రవాదులు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో టూరిస్టుల వీడియోలు కీలకంగా మారాయి. మహారాష్ట్ర టూరిస్ట్ శ్రీజిత్ తన కుమార్తె డ్యాన్స్ వీడియోలో అనుమానితులను గుర్తించారు. ఈ వీడియోల్లో ఇద్దరు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా గుర్తించిన శ్రీజిత్ NIAకి సమాచారం ఇచ్చారు. బైసరన్ లోయలో ఇద్దరు అనుమానితుల గుర్తించే పనిలో ఉన్న అధికారులకు ఈ వీడియోలలో ఉన్న అనుమానితులు దాడికి పాల్పడినవారిలో ఉన్నారన్న అనుమానం కలిగింది. కశ్మీర్ లోయలోని టూరిస్టు ప్రాంతాల్లో దాడికి ముందు రెక్కీ నిర్వహించారన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం దాడికి పాల్పడినవారిలో ఆ ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. దీనితో శ్రీజిత్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు NIA అధికారులు.