నిబంధనలు పట్టించుకోని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది!
మంచాల: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల కళ్లుగప్పి అనర్హులకు పత్రాలు జారీ చేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల తహశీల్దార్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్.. నగర శివారులోని ఓ మీసేవా కేంద్రం నిర్వాహకుడితో జతకట్టి అనర్హులకు ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీచేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							