National

చదువుకుంటారని స్కూలుకు పంపిస్తే, ఆ అమ్మాయిలేం చేశారంటే…!?

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా అనే గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు వయసుకి మించి పనులు చేశారు. స్నేహితురాలి బర్త్ డే సెలెబ్రేక్షన్స్ భాగంగా మందు తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మద్యం సేవించడం అనేది చాలా తప్పు, ఈ అలవాటు వల్ల కుటుంబాలే కూలిపోతున్నాయి. కానీ ప్రసుత్త పరిస్థితులు చుస్తే మద్యం లేకుండా ఏ వేడుక జరగదు. చిన్న,పెద్ద ,ఆడ, మగ, అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు మద్యానికి బానిసవుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా ప్రభుత్వ స్కూల్లో ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో కొందరు విద్యార్థినులు బీరు సేవిస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. అమ్మాయిలు క్లాస్ రూమ్‌లో కూర్చొని బీరు తాగిన వీడియోతో తల్లిదండ్రులు తలలుపట్టుకుంటున్నారు. .ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం విచారణ జరుపుతోంది.