‘కశ్మీర్‌పై మా ఆశ చావదు’..పాక్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవలే కశ్మీర్‌పై మా ఆశ చావదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ మా జీవనాడి అంటూ దానిని వదులుకోలేమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే భూతల స్వర్గమైన పహల్గావ్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో కావాలనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. ఈ ఉగ్రదాడిలో 30 మంది పర్యాటకులు మృతి చెందడం అందరి మనసులను కలచివేసింది. ఈ ఉగ్రదాడి తర్వాత పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుండి ఉత్తరం వైపు వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో నాలుగు ప్రత్యేక విమానాలను శ్రీనగర్ నుండి ముంబయి, ఢిల్లీకి ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Breaking news: ‘ఈ దృశ్యాలు చూసి గుండె పగిలిపోయింది’..చిరంజీవి

