Andhra PradeshHome Page Slider

ఓటుతోనే మన భవిష్యత్తుకు భరోసా:చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మాట్లాడుతూ..ఓటుతోనే మన భవిష్యత్తుకు భరోసా అన్నారు. కాగా ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత.. ఓటుతోనే భద్రత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల 21 నుంచి ఏపీలో ఓటర్ల జాబితా సమగ్ర కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోవాలని ఆయన సూచించారు. ఓటు లేకపోతే ఇంటికి వచ్చే బూత్‌స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి..ఓటరుగా నమోదు చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు.