‘అలా లేకపోతే వారిని కోల్పోతాం’..సమంత
నిజమైన ప్రేమకు బంధం మాత్రమే సరిపోదన్నారు ప్రముఖ నటి సమంత. ఆమె తాజాగా జీవిత భాగస్వామిపై ఈ సందేశాత్మక పోస్టును పంచుకోవడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. “మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, వారు కోరుకున్న విధంగా భాగస్వామికి కనిపించలేరు. మన మనసు, శరీరం ఎలా ఉందా అనేది మనం గుర్తించం. అంతా బాగా ఉందని అనుకుంటాం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బంధం ముగిసిపోతుందని, వారిని కోల్పోతాం” అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన జేశెట్టి అనే రచయిత మాట్లాడిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్టుతో వరుణ్ ధావన్‌తో కలిసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

