ఆన్ లైన్ ఆర్డర్ లో బిర్యానీదే పై చేయి
ఆన్ లైన్ డెలివరీలో వరుసగా తొమ్మిదో ఏడాది బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధికంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తెలిపింది. ఇవాళ ఆ సంస్థ 2024 ఏడాదికి సంబంధించి ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్, డైనింగ్ ట్రెండ్ ను ప్రస్తావించింది. బిర్యానీ తర్వాత 5.84 కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు పేర్కొంది. ఇక 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసినట్లు వెల్లడించింది.