బడ్జెట్‌పై విపక్షాల విసుర్లు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గంట కూడా కాకముందే విపక్ష కాంగ్రెస్ నేతలు ఈ బడ్జెట్‌పై విమర్శలు, విసుర్లు మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌ను సవరించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ బొనాంజా ప్రకటించిందన్నారు. బిహార్‌లోని మఖానా బోర్డు, వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నాసామర్థ్యం పెంచడం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
BREAKING NEWS: ఈ సారి బడ్జెట్‌లో మెరుపులెన్ని…మరకలెన్ని?

