బైజూస్‌పై ఒప్పో కేసు..రూ.13 కోట్లు బాకీ
ప్రముఖ లెర్నింగ్ యాప్ సంస్థ బైజూస్‌పై ఒప్పో కంపెనీ కేసు వేసింది. తమ ఫోన్లలో బైజూస్ యూప్‌ను ఇన్‌స్టాల్ చేసినందుకు తమకు రూ.13 కోటు బాకీ ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఒప్పో కంప్లైంట్ చేసింది. బైజూస్ దివాలా తీసే దశలో ఉండడం వల్ల ప్రమోటర్లు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుకుంది. విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్. ఆ రోజున బైజూస్ కంపెనీ పైన నమోదైన 10 పిటిషన్లను విచారణ అదే రోజున చేయనుండడం విశేషం.

