Home Page SliderNationalNews AlertPoliticsTrending TodayVideos

ఆపరేషన్ సింధూర్ వీడియో దృశ్యాలు విడుదల..

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ దాడి వివరాలను ప్రత్యేక విలేకర్ల సమావేశంలో రక్షణ శాఖ వివరించింది. ఈ వీడియోలను కూడా రిలీజ్ చేశారు. కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంప్‌పై ఎలా దాడి చేశామని సోఫియా వీడియో ప్రదర్శించారు. అర్థరాత్రి 1.05 నుండి 1.30 మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందిన ప్రాంతాలలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు.