నిర్మల్‌లో ఆపరేషన్ ఆకర్ష్ షురూ..
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. నిర్మల్‌లో కాంగ్రెస్ నేత రామారావు పటేల్‌కు తొలి గాలం వేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రామారావు పటేల్ త్వరలో కమలం తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. భైంసాలో ఎంపీ సోయం బాపూరావుతో చర్చలు కూడా జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశంతో రామారావును పార్టీలోకి ఆహ్వానించామని బాపూరావు చెప్పారు. కాగా.. రామారావు పటేల్ పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేడర్ తమతోనే ఉందని.. జిల్లాలో పార్టీకి త్వరలో పూర్వ వైభవం తీసుకొస్తామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి చెప్పారు.

