మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలపై ఓపెన్ బెట్టింగ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగితే రూ.కోటి బహుమతి ఇస్తానని ఓపెన్ బెట్టింగ్ ఆఫర్ చేశారు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్. మధ్యప్రదేశ్‌కు చెందిన డా. P.N. మిశ్రా ఈ ఆఫర్ ప్రకటించారు. ఒకవేళ సరిగ్గా అంచనా వేయలేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని షరతు విధించారు. కొంతమంది మీడియా వారు, రాజకీయ నాయకులు ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు, సర్వేలు, ఆధారాలు లేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆ అబద్దపు అంచనాలతో ప్రజలలో మూఢనమ్మకాలు పెంచుతున్నారని విమర్శించారు. అందుకే తాను ఇలాంటి ఆఫర్ పెట్టడం ద్వారా వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

