అల్లు అర్జున్‌కు ఏపి హైకోర్టులో ఊరట-నంద్యాల కేసు క్వాష్
ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో నంద్యాల ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడని పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్ పై నంద్యాల పీఎస్ లో నమోదైన కేసును ఏపి హైకోర్టు బుధవారం క్వాష్ చేసింది. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మిత్రుడైన శిల్పా రవి ఇంటికి వెళ్లారని ,ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది.అయితే తాను ప్రచారానికి వెళ్లలేదని, ఒక మిత్రునిగా నే వెళ్లాని అది తప్పెలా అవుతుదంటూ అల్లు అర్జున్ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం పూర్వాపరాలు పరిశీలించి కేసు కొట్టివేసింది.దీంతో పుష్పాకి ఊరట లభించింది.