HealthHome Page SliderNational

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కల్పతరువు “ఓసైట్ క్రయోప్రెజర్వేషన్”

సైన్స్ అభివృద్ధి చెందుతున్నకొద్దీ వైద్యంలో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ వ్యాధి సోకిన మహిళలు కూడా తల్లి అయ్యే మహదవకాశాన్ని కలిగిస్తోంది ఈ ఓసైట్ క్రయోప్రెజర్వేషన్. దీనినే సాధారణ పరిభాషలో ఎగ్స్ ఫ్రీజింగ్ అంటారు. క్యాన్సర్, కీమోథెరపీ, రేడియోథెరపీ చేయించుకుంటున్న మహిళలకు ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ ప్రక్రియ ద్వారా కావాలనుకున్నప్పుడు తల్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సల కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా తల్లి కావాలంటే చికిత్సకు ముందుగానే ఎగ్స్‌ను సురక్షితంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. తీవ్ర అనారోగ్యాల పాలైన మహిళలు కూడా ఈ పద్దతిని పాటించవచ్చు. ఈ పద్దతి వల్ల పెద్ద వయస్సులో కూడా తల్లి అయ్యే ఆనందాన్ని పొందవచ్చు. కెరీర్లో కూడా గోల్స్ పెట్టుకున్న మహిళలు వారు రాజీపడకుండా వయస్సు ఎక్కువైనా కూడా తల్లి కావచ్చు. 20 నుండి 30 సంవత్సరాల వయస్సులో మహిళలు గర్భం దాల్చడానికి సరైన సమయం. ఈ సమయంలో వారు ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎంచుకుంటే తర్వాత కాలంలో వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు.