Andhra PradeshBreaking NewscrimeHome Page Slidermovies

గేమ్ ఛేంజర్ కి వెళ్ళొస్తూ…కాన‌రాని లోకాల‌కు

ఆనందంగా ఉన్న వారి జీవితం ఒక్కసారిగా యూ ట‌ర్న్ తీసుకుంది.లైవ్లీహుడ్ గా ఉన్న‌ వారి జీవితాలు బ‌రేల్ గ్రౌండ్ కి ఛేంజ్ అయ్యాయి. రాజ‌మండ్రిలో జ‌రిగిన గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్ వెళ్లొస్తూ త‌మ నూరేళ్ల జీవితాన్ని ప్ర‌మాదాల‌కు ఫ‌ణంగా పెట్టారు.గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి వెళ్లి తిరిగి బైక్‌పై వ‌స్తుండ‌గా… రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు త‌ప్పి వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23) అనే వ్య‌క్తి అక్కడికక్కడే మృతి చెందగా చ‌ర‌ణ్ అనే యువ‌కుడు తీవ్రంగా గాయపడి ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుంగా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచాడు.మృతులు కాకినాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు .మెగా ఫ్యాన్స్ నాయకులు …మృతుల‌ను ప‌రామ‌ర్శించి వారి కుటుంబీకుల‌కు సానుభూతి తెలిపారు. విష‌యాన్ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి,సినీ హీరో చ‌ర‌ణ్‌కి తెలియ‌జేస్తామ‌ని చెప్పారు.