Home Page SliderInternationalPolitics

‘అప్పుడే మేం చనిపోయేవాళ్లం’..బంగ్లా మాజీ ప్రధాని

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పార్టీ అవామీ లీగ్ పార్టీ  ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఆడియో సందేశం పోస్ట్ చేశారు. ఈ ఆడియోలో ఆమె తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. కేవలం అల్లా దయ వల్లనే తాను జీవించి ఉన్నానని, లేదంటే అప్పుడే చనిపోయేవాళ్లమని పేర్కొన్నారు.  గత ఆగస్టులో జరిగిన హత్యలు, మారణకాండ నుండి, కోటలీపర బాంబు దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నామని గుర్తు చేసుకున్నారు. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో నేను, నా సోదరి రెహానా మరణం నుండి బయటపడ్డామని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన బంగ్లాదేశ్ అల్లర్లలో షేక్ హసీనా ఆర్మీ విమానంలో తప్పించుకుని భారత్ చేరుకుని ప్రాణాలు కాపాడుకున్న విషయం తెలిసిందే.