‘ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసు’..కేసీఆర్
తెలంగాణలో ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో చాలాకాలం తర్వాత కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజల కోసం మొదటి నుండి పోరాటాలు చేసింది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని, ప్రజల కష్టాలు మనకు మాత్రమే తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోలేక చతికిలబడిందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, వందశాతం మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీలోని వాళ్లే పార్టీ పనయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారికి తగిన బుద్ది చెప్తామన్నారు.

