TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన అధికారులు తాజా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట ఉపాధి హామీలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. గ్రూప్-1 పరీక్ష పేపర్‌ను కొనుగోలు చేసిన ప్రశాంత్.. 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది.