Home Page SliderTelangana

పరీక్షకు హాజరైన ప్రతీ ఒక్కరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే

TSPSC పరీక్షకు హాజరైన ప్రతీ ఒక్కరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు బండి సంజయ్. TSPSC వ్యవహారంలో కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా దర్నాలో కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కేసీఆర్ కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్‌కు సంబందం ఉందని, అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని, TSPSC ఛైర్మన్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కల్వకుంట కుటుంబం కోసమే తెలంగాణా వచ్చిందా అని అడిగారు. కవిత కోసం క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి పోతున్నారని ఎద్దేవా చేశారు. లీకులు కామన్ అంటూ మరొక మంత్రి మాట్లాడుతున్నారన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత బాధలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. దొంగల్ని పట్టుకోమంటే, నోటీసులతో సరిపెడుతున్నారన్నారు.  తెలంగాణాను కష్టపడి సాధించుకున్నామని, కేవలం ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను తయారుచేస్తామన్నారు.