ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్..సీఎం
ఏపీలోని తీరప్రాంతాలలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టును గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీలోని అతి పెద్ద సముద్రతీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీతో పాటు పలువురు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర అధికారులతో విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని కోరారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాలలో రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.