మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870/- పెరిగి రూ.69,820/-కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర గ్రాముకు రూ.800/- పెరిగి రూ.64,000/-గా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.2000/- పెరిగింది. దీంతో మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.91,000/- పలుకుతోంది.

