Home Page SliderTelangana

మరోసారి కవిత జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పడప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదు.కాగా కవిత ఇప్పటికే బెయిల్ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కవితకు ఇప్పటికీ బెయిల్ లభించలేదు. అయితే  తాజాగా మరోసారి కూడా  ఆమెకు నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.