విశాఖలో ఒమిక్రాన్ కలకలం..
విశాఖ కేజీహెచ్‌లో నమోదైన కొవిడ్ కేసులలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీలో పరీక్షించగా, ఒమిక్రాన్ బీఎ.2 ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే దీనిపై ఆందోళన వద్దని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. కరోనా నిర్థారిత పరీక్షలను రోజుకు వెయ్యి వరకూ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత జీజీహెచ్‌లలో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్‌లలో రోజుకు 50 చొప్పున పరీక్షలకు కిట్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.