Home Page SlidermoviesNational

‘ఓజీ’లో స్పెషల్ సాంగ్ ఈ హీరోయినే..

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీడీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రంపై అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ‘డీజే టిల్లు’ చిత్రంలో రాధికగా అలరించిన నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తోందని సమాచారం. ఈ పాట షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాంగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. థాయ్‌లాండ్ నుండి వితయ పన్‌శ్రీగమ్,  జపాన్ నుండి కజుకి కితమురు కూడా నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.