ఏసిబి కార్యాలయంలో అధికారుల భేటీ
ఫార్ములా ఈ కేసులో ఈనెల 9న ఏసిబి విచారణకు హాజరుకావాల్సిన కేటిఆర్… హాజరవుతారా లేదా సుప్రీం కోర్టుని ఆశ్రయించి మధ్యంతర బెయిల్ తెచ్చుకుంటారా అనే సందిగ్దంలో తెలంగాణ ఏసిబి ఉంది.ఈ మేరకు విచారణ సందర్భంగా ముందుకు ఎలా సాగాలి అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేటిఆర్ కంటే ముందుగా కేవియెట్ పిటీషన్ దాఖలు చేసింది.కేటిఆర్ గనుక సుప్రీం ఆశ్రయిస్తే…తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ఏసిబి పిటీషన్ చేసింది.అనంతరం ఏసిబి అధికారులంతా హైద్రాబాద్‌లో భేటీ అయ్యారు.