NationalNewsNews Alert

6జీ సేవలకు కసరత్తు : నరేంద్ర మోదీ

5జీ సేవలు ఇంకా అందుబాటులోకే రాలేదు. ఈ సేవలు ప్రారంభించేందుకు ఓవైపు వేగంగా పనులు కొనసాగుతుండగా.. ఇప్పుడు 6జీ సేవలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వినోద రంగాలతో పాటు గేమింగ్ లో భారత సొల్యూషన్స్ కోసం ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తుందని ప్రకటించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్వన్ వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ముందుగా దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఢిల్లీ తోపాటు చెన్నై, బైంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్ కతా, లక్నో, అహ్మదాబాద్, గురుగావ్ నగరాలు అందులో ఉన్నాయని వైష్ణవ్ తెలిపారు.