జస్టిస్ రమణకు జర్నలిస్ట్ సంఘాల కృతజ్ఞతలు
నిరీక్షణ ఫలించింది. సొంత స్ధలంపై ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నెరవేర బోతున్నాయి. సంవత్సరాల కొద్ది కోర్టులో ఉన్న కేసుకు విముక్తి ప్రసాదించి .. జర్నలిస్టులకు న్యాయం చేసిన జస్టిస్ రమణకు జర్నలిస్ట్ సంఘాలు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాయి. ఒకప్పడు జర్నలిస్టుగా పనిచేసిన ఆయన సాటి జర్నలిస్టుల కష్టాలను అర్ధం చేసుకుని వారికి సరైన తీర్పునందించారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను డెవలప్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు నిచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఎయిడెడ్, హైదరాబాద్ జర్నలిస్టు సంఘాల నేతలు ఈరోజు ఢిల్లీలో జస్టిస్ ఎన్వీ రమణని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఇవాళ జస్టిస్ రమణ పుట్టిన రోజు కావడంతో టీయుడబ్ల్యూజె, ఐజేయూ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.LATE

ఢిల్లీ లోని కృష్ణమీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. తనను కలిసిన వారందరినీ జస్టిస్ రమణ ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. పాత మిత్రులందరినీ కలిసినందుకు ఎన్వీ రమణ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.