Home Page SliderInternationalmovies

‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్లేయర్స్ పోస్టర్‌లో ఎన్టీఆర్..పోస్ట్ వైరల్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఇంటర్నేషనల్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో, ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) కూడా వాడేసుకుంది. ముగ్గురు ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్‌మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్ క్రియేట్ చేసి, ‘నాటు నాటు’ పాటకు స్టెప్స్ వేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేసింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఈ పోస్టర్‌పై స్పందించి ముగ్గురు ఆటగాళ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.