నీట్ తుది ఫలితాలను విడుదల చేసిన NTA
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది.ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నీట్ ఎగ్జామ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి నిర్వహించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్-యూజీ తుది ఫలితాలను తాజాగా ప్రకటించింది.

