Breaking Newshome page sliderHome Page SliderNewsTelanganaviral

కొత్త మద్యం షాప్ లకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపుకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. దరఖాస్తులు నేటి నుండి అక్టోబర్ 18 వరకు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఈసారి లైసెన్స్ గడువు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. టెండర్ ఫీజును రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకు పెంచి, ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా చెల్లించే సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఉన్న షాపుల లైసెన్స్‌లు నవంబర్ 30తో ముగియనుండగా, ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారికి షాపుల కేటాయింపులో అర్హత ఉండదు. రాష్ట్రంలోని 2,620 దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండనుంది.