మెగా మేనల్లుడికి నోటీసులు…!
సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తనకు, సాయి ధరమ్ తేజ్ కు, నిర్మాతకు నోటీలు ఇచ్చారు పోలీసులు ఇచ్చారని సంపత్ నంది తెలిపారు. కథను బట్టి టైటిల్ పెట్టాం.. అయితే టైటిల్ మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి దాని కంటే సినిమా ఆపేయడమే బెటర్ అనిపించింది ఆపేశాం అని తెలిపాడు సంపత్ నంది.‘గాంజా శంకర్’ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. సినిమాలో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలను ఉంటే వాటిని వెంటనే తొలగించాలని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు.