Home Page SliderTelangana

కేసీఆర్‌కు నోటీసులు

తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణాలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్.నరసింహ రెడ్డి తెలిపారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాదాద్రి విద్యుత్ కేంద్రం,ఛత్తీస్‌ఘడ్ కరెంటు కొనుగోలులో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో భాగంగానే కేసీఆర్,సురేశ్ చంద్రా,అజయ్ మిశ్రాతోపాటు మరో 25 మందికి నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్.నరసింహ రెడ్డి వెల్లడించారు.ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన కేసీఆర్ జూలై 30లోపు వివరణ ఇస్తానని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటివరకు సమయం ఇవ్వడం కుదరదని జూలై 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపినట్లు ఎల్.నరసింహరెడ్డి స్పష్టం చేశారు.