Home Page SliderTelangana

కౌశిక్ రెడ్డికి నోటీసులు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు షాకిచ్చారు. తన విధులకు ఆటంకం కలిగించి.. దురుసుగా ప్రవర్తించారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో నమోదైన కేసులో ఇవాళ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసింది.