వాటికి నోటీసులివ్వం..కూల్చడమే..
హైడ్రాపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ, ప్రజల భూములు కబ్జాకు గురిచేస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. చెరువులు ఆక్రమించి కట్టే కట్టడాలకు నోటీసులిచ్చే పని లేదని, కూల్చడమే అంటూ వ్యాఖ్యానించారు. ఆక్రమణకు గురయిన చెరువులను ఇప్పటివరకూ 300 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకుందని, వీటిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. 550 చెరువుల ఎఫ్‌టీఎల్ వర్క్ నడుస్తోందని, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు. అలాగే హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారు తగిన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

