సాధించే సంకల్పం ముందు ఏది అడ్డురాదు…
బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఒక యువతి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహించే KBC (కౌన్ బనేగా కరోడ్‌పతి ) లో పాల్గొని 50 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకొన్నది. రాజస్థాన్ కు చెందిన నరేషీ మీనా 2018 లో SI పరీక్షలో ఉతీర్ణులయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకు అయ్యే ఖర్చు కోసం కష్టపడుతున్నారు. తాజాగా KBC లో 50 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. మరియు తన చికిత్సకు బాధ్యత అమితాబ్ గారు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. సాధించే సంకల్పం ముందు ఏది అడ్డురాదు అని ఆమె నిరూపించింది.