ఇంటర్ TEXT బుక్స్ అందించకపోవడం బాధ్యతారాహిత్యం: హరీష్‌రావు
తెలంగాణలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని.. జూనియల్ కాలేజీల్లో ఉన్న దాదాపుగా 17 వందల మంది ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు భర్తీచేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

