కామారెడ్డి, గజ్వేల్ కాదు.. ఖమ్మంకు రండి.. కేసీఆర్‌కు పొంగులేటి సవాల్
పార్టీ నాయకుడిగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడానికి ఆయన వద్దకు వచ్చానన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తుమ్మల, కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కొట్టాలంటే అన్ని శక్తులు ఏకం కావాలని ఆయన అన్నారు. తుమ్మల నాగేశ్వరారవు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నానన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందన్నారు.

ఎన్నికల్లో గెలవడానికి కేవలం డబ్బు, శక్తి, ఉంటేనే సాధ్యం కాదని… బలమంటే రాజకీయాల్లో ప్రజాబలం మాత్రమేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కేవలం డబ్బు బలం మాత్రమే సరిపోదన్నారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని పొంగుల జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కుటుంబ ఉండదని, రాబోయేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇస్తారన్నారు.

వాస్తవానికి తనకు ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని ఉందని… అది తన కోరిక అని చెప్పారు. కేసీఆర్ ఇప్పుడైనా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేత మైనార్టీ అభ్యర్థిపై కాకుండా, ఖమ్మం జిల్లాలో తనపై పోటీ చేయాలని అన్నారు. కేసీఆర్ పై తాను పోటీ చేస్తానన్న పొంగులేటి.. బలమేంటో ప్రజా కోర్టులో తేలుద్దాన్నారు. అధికార మదంతో, డబ్బుందన్న అహంకారంతో విర్రవీగుతున్నారో దానిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారన్నారు.