బర్డ్ ఫ్లూ కాదు…అంతకు మించి
బర్డ్ ఫ్లూ ని మించి మాయదారి రోగమేదో కోళ్లను ఆవహించింది.దీంతో వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.ఇది బర్డ్ ఫ్లూ ను మించిన రోగమని పశుసంవర్ధక శాఖ వైద్యులు అనుమానిస్తున్నారు. తెలంగాణలోని పలు కోళ్ల ఫామ్ లో అంతుచిక్కని వ్యాధితో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరులోని ఓ ఫాంలో 3 రోజుల్లో 2,500 కోళ్లు మృతి చెందాయి. దాంతో ఆ ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఈ నెల 16న 117, 17న 300, మిగతా కోళ్లు 18న చనిపోయాయని వెల్లడించారు. 19న శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపామని, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కోళ్ల మరణాలకు కారణం తెలుస్తుందని తెలిపారు.