జూపార్క్ తరలింపు లేదు.. ఒట్టి వదంతులే: రాష్ట్ర వైల్డ్‌లైఫ్ చీఫ్
నెహ్రూ జులాజికల్ పార్క్‌ను షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ వైల్డ్‌లైఫ్ చీఫ్ పీసీసీఎఫ్ మోహన్ వర్గేన్ స్పష్టం చేశారు. జుపార్క్ తరలింపు అంత సులభమైన విధంగా జరిగేది కాదని పేర్కొన్నారు. నూతన స్థల ప్రతిపాదనల అనుమతులు, నిర్ణయాలు సెంట్రల్ జూ అథారిటీ ఢిల్లీ నుండి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 1963లో ఏర్పడిన జూపార్క్ ఇటీవలే 60 ఏళ్లు పూర్తిచేసుకుంది, ఇప్పటివరకు 60 లక్షల మంది సందర్శకులకు ఆహ్లాదం పంచిన ఈ పార్క్‌ను తరలించాలనే ప్రతిపాదన అటవీ శాఖకు లేదని పేర్కొంది.