ముస్లిం, కాశ్మీరీలపై వ్యతిరేకత వద్దు..
ముస్లింలకు, కాశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని మేము కోరుకోవడం లేదని భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి అన్నారు. తమకు శాంతి మాత్రమే కావాలి.. ఉగ్రదాడికి కారణం అయిన వారిని శిక్షించి తమకు న్యాయం చేయండి మోదీ ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.