కుంభమేళాలో ఇకపై నో వీఐపీ..
యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్ల కొలది ప్రజలు రావడం, తీవ్ర తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రయాగ్‌గాజ్ సంగమంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం 30 మంది భక్తులు మృతి చెందినట్లు తేలింది. మరో 60 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీనితో ఫిబ్రవరి 4 రథసప్తమి వరకూ వీవీఐపీ పాసులు రద్దు చేసింది ప్రభుత్వం. వీఐపీలకు ఫిబ్రవరి 4 వరకూ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని వెల్లడించింది. అలాగే ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై నిషేధం, వన్ వే రూట్ ఏర్పాటు చేసింది.